Friday, September 20, 2024
HomeTrending NewsG20: ఢిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

G20: ఢిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు యూకే ప్రధాని రిషి సునక్ ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. యూకే ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. కేంద్ర వినియోగదారులు, ఆహార శాఖ సహాయ మంత్రి అశ్వని చౌబే బ్రిటన్ ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఇండియాకి రావడం చాలా సంతోషంగా ఉందని, భారత్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని రిషి సునాక్ అన్నారు. తనని ఇండియా అల్లుడిగా పిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటన తనకెంతో ప్రత్యేకం అని వెల్లడించారు. మూడు రోజుల పాటు భారత్‌లోనే ఉండనున్నారు సునాక్. ఇన్‌ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు రిషి సునాక్.

ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, హాజరవడం లేదు. వీరి తరఫున ఆయా దేశాల ప్రతినిధులు వస్తున్నారు. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన రావడం లేదు. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోనీ తదితరులు హాజరవుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు జోబైడెన్ భారత్‌కు చేరుకోవచ్చు. ఆయనకు కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్ స్వాగతం పలుకుతారు.

జీ20లో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యన్ ఫెడరేషన్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యూకే, అమెరికా దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడ ఉంది. సెప్టెంబర్ 9, 10 (శని, ఆదివారాలు)లలో జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్