Sunday, September 22, 2024
HomeసినిమాVishal: కన్ఫ్యూజన్ లో కామెడీ చేసిన 'మార్క్ ఆంటోని' 

Vishal: కన్ఫ్యూజన్ లో కామెడీ చేసిన ‘మార్క్ ఆంటోని’ 

విశాల్ గురించి ఈ రోజున ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఎందుకంటే తాను ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వరుస సినిమాలు చేస్తూనే వెళుతున్నాడు. వీలైనప్పుడల్లా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా ఈ సారి ఆయన చేసిన ప్రయోగం పేరే ‘మార్క్ ఆంటోని’. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. ఫోన్ ఫార్మేట్ లో తయారు చేయబడిన టైమ్ మెషిన్ .. దాని చుట్టూ అల్లుకున్న యాక్షన్ కామెడీతో ఈ కథ నడుస్తుంది.

ఈ సినిమాలో కొత్త పాయింట్ ఉంది. ఇంతవరకూ గతంలోకి .. భవిష్యత్తులోకి తీసుకుని వెళ్లే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ సినిమాలే వచ్చాయి. కానీ ఈ సినిమాలో భవిష్యత్తులోకి తీసుకుని వెళ్లే అవకాశం లేదు గానీ, గతంలోకి వెళ్లొచ్చు. గతంలో జరిగిన కొన్ని ప్రమాదాలను .. పొరపాటలను సరిచేసుకోవచ్చు. అది కూడా కొత్తగా కనుక్కున్న ఒక టెలిఫోన్ ద్వారా. ఈ అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. హీరో .. విలన్ ఇద్దరూ ఈ టైమ్ మెషిన్ గా చెప్పబడే ఈ టెలీఫోన్ కోసమే పోటీ పడుతుంటారు.

ఇదేదో కొత్త పాయింటులానే ఉంది .. కామెడీని ఒక రేంజ్ లో పండించడానికి ఛాన్స్ ఉందని అనుకోవడంలో అమాయకత్వం లేదు. కానీ దర్శకుడు అంత కామెడీని వర్కౌట్ చేయలేకపోయాడు. అంతేకాదు .. అటు హీరో .. ఇటు విలన్ ఇద్దరితో డ్యూయెల్ రోల్ చేయించి, సామాన్య ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశాడు. అందువలన సినిమాలు  చూడటంలో పండిపోయిన వారికి ఈ కథ ఓ మాదిరిగా ఎక్కుతుందిగానీ, మిగతా ప్రేక్షకులకు ఏం జరుగుతుందన్నది తెలుసుకోవడానికి చాలానే సమయం పడుతుంది. మొత్తానికి ‘మార్క్ ఆంటోని’ తమకి పెద్ద టెస్ట్ పెట్టేశాడని ఆడియన్స్ అనుకోకుండా ఉండలేరని మాత్రం చెప్పచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్