స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ను ఏసీబీ కోర్టు అక్టోబరు 19 వరకు పొడిగించింది. సెప్టెంబర్ 9న బాబును అదుపులోకి తీసుకోగా తొలుత 22 వరకూ రిమాండ్ విధించి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. సెప్టెంబర్ 22న బాబును వర్చువల్ గా విచారించి రిమాండ్ ను అక్టోబర్ 5 (నేటి) వరకూ పొడిగించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో ఇవాళ సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిపై ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ ను అక్టోబర్ 19 వరకూ పొడిగించారు.
మరోవైపు చంద్రబాబు బెయిల్, సిఐడి కస్టడీ పిటిషన్లపై వాదనలను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.