తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్ తో ప్రమాణం చేయించారు. మరో 33 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సాదాసీదాగా ఈ కార్యక్రమం జరిగింది.
మొత్తం 34 మంది మంత్రివర్గంలో 19 మందికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం వుంది. 15 మంది కొత్తగా మంత్రి పదవులు చేపడుతున్నారు. కేబినెట్ లో ఇద్దరు మహిళలకి స్థానం కల్పించారు. ముందుగా అనుకున్నట్లుగానే మా సుబ్రమణియన్ కు ఆరోగ్య శాఖ కేటాయించారు.
కీలకమైన హో శాఖను స్టాలిన్ తన వద్దే ఉంచుకున్నారు. సెంథిల్ బాలాజీకి కీలకమైన విద్యుత్ తో పాటు ఎక్సైజ్, మద్య నిషేధ శాఖలు కేటాయించారు. కాగా, స్టాలిన్ కుమారుడు, డిఎంకే యువ నేత ఉదయనిది స్టాలిన్ కు కేబినెట్ లో స్థానం దక్కలేదు. తరువాత జరిగే విస్తరణలో ఆయనకు అవకాశం దక్కవచ్చని డిఎంకే వర్గాలు తెలిపాయి.
ఈ కార్యక్రమంలో స్టాలిన్ కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం, ఎండి ఎంకే నేత వైకో పాల్గొన్నారు. అన్నాడిఎంకే నుంచి పన్నీర్ సెల్వం హాజరయ్యారు.