Saturday, November 23, 2024
HomeTrending Newsసిఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

సిఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

పెట్రోలు ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సిఎం ఎంకె స్టాలిన్‌ నేతృత్వంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ పద్దు తయారీ సందర్భంగా పెట్రోల్‌ ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోలుపై రూ.3 వంతున ధర తగ్గించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ ప్రకటించారు.లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ.1,160 కోట్ల నష్టం వస్తుందని, అయినా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. డీజిల్‌ రేట్ల తగ్గింపు ఉంటుందా లేదా అనేదానిపై ఎలాంటి ప్రకటన రాలేదు.

సిఎం స్టాలిన్ నిర్ణయాన్ని తమిళనాడు తో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని ప్రజలు ప్రశంసిస్తున్నారు. తమిళనాడు తరహాలోనే రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలు కూడా చమురు ధరలు తగ్గించే విధంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి డిమాండ్లు రానున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్