Monday, November 11, 2024
HomeTrending Newsబటన్ నొక్కేందుకు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు: బాబు

బటన్ నొక్కేందుకు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు: బాబు

ఇన్ని బటన్లు నొక్కానని చెప్పుకుంటున్న సిఎం జగన్ జాబ్ క్యాలండర్ బటన్ ఎందుకు నొక్కలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. సీపీఎస్ రద్దుకు, గుంటలు పడిన రోడ్లు బాగుచేయడం కోసం… రైతు ఆత్మహత్యల నివారణ కోసం.. మద్యపాన నిషేధానికి, డిఎస్సీ కోసం ఎందుకు  బటన్లు నొక్కలేకపోయారని నిలదీశారు. కానీ అక్రమ ఇసుక కోసం, అక్రమ మద్యం కోసం మాత్రం బటన్లు నొక్కారని ఎద్దేవా చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో జరిగిన ‘రా! కదలిరా!’ బహిరంగసభలో బాబు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా ఈ సిఎం కు వ్యతిరేకంగా బటన్ నొక్కేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.  మరో 64 రోజుల్లో సిఎం జగన్  ఇంటికి పోవడం ఖాయమని, టిడిపి-జనసేన కూడమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రశంతమైన ఉత్తరాంధ్రలో కొండలను దోచేశారని, లక్షల కోట రోపాయలు దోచుకున్నారని ధ్వజమెత్తారు.  పేదల ఇళ్ళ కోసం లక్ష రూపాయలు ఇవ్వలేకపోతున్నారని, కానీ రూ.500 కోట్లతో రిషికొండపై భవంతి నిర్మించుకున్నారని విమర్శించారు. ఒకప్పుడు పెట్లుబడులకు స్వర్గధామంగా ఉన్న విశాఖ ఇప్పుడు కబ్జాలకు కేంద్రంగా మారిందన్నారు. విశాఖపట్నం మెట్రో, భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులకు తాము శ్రీకారం చుట్టామని… తాము అధికారంలో ఉండి ఉంటే ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తి అయి ఉండేవని, విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల స్థలం కూడా ఇవ్వలేకపోయారన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కాకుండా ఆపలేకపోతున్నారని, గతంలో వాజ్ పేయి హయంలో ఇలాంటి ప్రతిపాదన వస్తే ఆ కంపెనీకి నిధులు ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు.

గంజాయి నివారణ కు చర్యలు తీసుకోలేకపోతున్నారని , ఏపీ పోలీసులు గంజాయి అమ్ముతూ తెలంగాణలో అమ్ముతూ పట్టుబడటం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. విశాఖలో ఓ తహసీల్దార్ ను హత్యచేసి దర్జాగా విమానంలో పారిపోయారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవాలని,  పులివెందుల రౌడీలు విశాఖను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.

ఫ్యానుకు  మూడు రెక్కలు ఉంటాయని…  విధ్వంసం చేసే రెక్కను ఉత్తరాంధ్ర;  బాడుడే బాదుడు రెక్కను కోస్తా, హింస దోపిడీ రెక్కను సీమ ప్రజానీకం తుంచేసి మొండి ఫ్యాన్ ను జగన్ చేసికి ఇచ్చి ఐదేళ్ళ పాలనకు రిటర్న్ గిఫ్ట్ ఇవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

RELATED ARTICLES

Most Popular

మన భాష- 4

మన భాష- 3

మన భాష- 2

న్యూస్