భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఇంగ్లాండ్ లో స్వదేశంలో జరుతుతోన్న టెస్ట్ సిరీస్ లో ప్రస్తుతం రాజ్ కోట్ లో జరుగుతోన్న మూడో టెస్ట్ లో నేడు ఈ ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 445 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇన్నింగ్స్ ను దూకుడుగా మొదలు పెట్టారు. 89 పరుగుల వద్ద ఓపెనర్ జాక్ క్రాలే వికెట్ తీయడం ద్వారా వరల్డ్ క్రికెట్ చరిత్రలో 500 వికెట్ల క్లబ్ లో చేరిన పదో ఆటగాడిగా అశ్విన్ రికార్డు సాధించాడు. ఇండియా ఆటగాడు అనిల్ కుంబ్లే 619 వికెట్లతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో నాలుగో స్థానంలో నిలిచాడు.
మురళీధరన్ (800); షేన్ వార్న్ (708); జేమ్స్ అండర్సన్ (696); అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604); మెక్ గ్రాత్ (563), కట్నీ వాల్ష్ (519), నాథన్ లియాన్ (517), అశ్విన్ (500) లు టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాళ్లుగా ఉన్నారు.