తూర్పు గోదావరిలో జనసేన పార్టీకి చెందిన కీలక నేతలు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో మెజార్టీ బీసీ, ఎస్సీ నేతలు కావడం గమనార్హం. తణుకు సమీపంలో జగన్ బస చేసిన తైతలి క్యాంపులో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, అభ్యర్ధులు కూడా పాల్గొన్నారు.
కాకినాడ మాజీ మేయర్ సరోజ, రాజోలు జనసేన ఇన్ ఛార్జ్ బొంతు రాజేశ్వరరావులు నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్ జగన్ వీరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇప్పటికే అమలాపురం ఇన్ ఛార్జ్ రాజబాబు, ముమ్మడివరం ఇన్ ఛార్జ్ పితాని బాలక్రిష్ణ, పిఠాపురం ఇన్ ఛార్జ్ శేషు కుమారి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
నేటి యాత్ర తేతలి, తణుకు, పెరవలి మీదుగా సాగి తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించనుంది. రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.