Thursday, November 21, 2024
Homeస్పోర్ట్స్Rain Effect: గుజరాత్ తో మ్యాచ్ రద్దు- ప్లే ఆఫ్స్ కు హైదరాబాద్

Rain Effect: గుజరాత్ తో మ్యాచ్ రద్దు- ప్లే ఆఫ్స్ కు హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ – గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో నేడు జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకూ చెరో పాయింట్ లభించింది. దీనితో హైదరాబాద్ ఆడాల్సి చివరి మ్యాచ్ జయాపజయాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ కు ప్రవేశించింది. నాలుగేళ్ల తర్వాత రైజర్స్ జట్టు లీగ్ దశను దాటి ప్లే ఆఫ్స్ కు చేరడం గమనార్హం.

మధ్యాహ్నం వరకూ మంచి ఎండకాసిన హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి భారీ వర్షం మొదలైంది. స్టేడియం సిబ్బంది ముందస్తుగానే పిచ్ పై కవర్లు ఉంచారు. గంట తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగానైనా జరుగుతుందని అభిమానులు భావించారు. కానీ ఏడున్నర తర్వాత నుంచి చిరుజల్లులు ఆగకుండా పడుతూనే ఉండడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. మ్యాచ్ స్వయంగా వీక్షిద్దామని వచ్చిన అభిమానులు నిరాశతో వెనుదిరిగాల్సి వచ్చింది.

కాగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కి చేరిన విషయం తెలిసిందే. మిగిలిన రెండు స్థానాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు జట్లు పోటీలో ఉండగా హైదరాబాద్ ఒక ప్లేస్ దక్కించుకుంది. మిగిలిన స్థానం కోసం చెన్నై, బెంగుళూరు శనివారం పోటీ పడనున్నాయి. చెన్నై ఇప్పటికే 14 పాయిట్లతో నాలుగో ప్లేస్ లో ఉండగా, బెంగుళూరు 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మంచి రన్ రేట్ తో బెంగుళూరు విజయం సాధిస్తేనే ఆ జట్టుకు టాప్ 4 లో అవకాశం దక్కుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్