రోదసియాత్రని విజయవంతంగా పూర్తిచేసిన తొలి తెలుగువ్యక్తిగా విజయవాడకు చెందిన గోపీచంద్ అరుదైన ఘనత సాధించారు. పర్యాటకుడి హోదాలో ఆయన ఈ యాత్ర చేయడం విశేషం. మే 19న బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన మిషన్ ఎన్ఎస్25 లోగోపిచంద్ తో పాటు మరో నలుగురు ఆస్ట్రోనాట్ లు ఈ అంతరిక్ష యాత్ర పూర్తి చేశారు.
విజయవాడ లో పుట్టిన గోపీచంద్ తోటకూర ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్‌లో బీఎస్సీ పూర్తి చేసి అనంతరం పైలట్‌గానూ శిక్షణ పొందారు. పలు కమర్షియల్ జెట్లు, స్కైప్లేన్లు, ఎయిర్ ఆంబులెన్స్‌లకు పైలట్‌గా వ్యవహరించారు. అట్లాంటా లో ప్రిసర్వ్ లైఫ్ అనే ఒక వెల్నెస్ సెంటర్ కు కో-ఫౌండర్.
1984లో రాకేశ్ శర్మ రోదసియాత్ర చేసి తొలి ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. తర్వాత కల్పనా చావ్లా, సునీత విల్లియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల అంతరిక్షయానం చేసినా వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. గోపీచంద్ తోటకూర ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ తనకు ఇండియా పాస్పోర్ట్ ఉంది, కాబట్టి అంతరిక్షంలో ప్రవేశించిన రెండవ భారతీయుడు గోపీచంద్.