ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగింది. గత వారం బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఐదు సంతకాలపై సిఎం బాబు చేసిన సంతకాలకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది. మెగా డీఎస్సీ, పెన్షన్ పెంపు, అన్నా క్యాంటిన్ల ఏర్పాటు, స్కిల్ సెన్సెస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశాలపై బాబు నిర్ణయం తీసుకుని వాటిపై తొలి సంతకాలు చేసిన సంగతి తెలిసింది. ఆ నిర్ణయాలను నేడు కేబినేట్ ఆమోదించింది.
గంజాయిని అరికట్టడంపై కేబినేట్ లో కీలక చర్చ జరిగింది. మత్తు పదార్థాల నివారణకు మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంద్యారాణి, సత్య కుమార్, కొల్లు రవీంద్రలతో లతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. వాలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ సచివాలయాల సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని…. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ ని ఎంటీఆర్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మారుస్తూ మంత్రిమండలి నిర్ణయించింది. జూలై 1 న పెంచిన పెన్షన్ ను ఏడు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయానున్నారు.
మొత్తం ఏడు అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని కేబినేట్ తీర్మానించింది. పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్, శాంతి భద్రతలు, ఫైనాన్స్, విద్యుత్ శాఖలపై వాస్తవ పరిస్థితిని వైట్ పేపర్ ద్వారా ప్రజలకు వివరించాలని కేబినేట్ నిర్ణయించింది.