Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమీనా బింద్రా బిబా విజయకేతనం

మీనా బింద్రా బిబా విజయకేతనం

నిధుల కొరతతో రోజూ వేలాది స్టార్టప్ లు విఫలమవుతున్న వేళ…
ఓవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదురు తన్నుతున్నా..
మీ బలమైన సంకల్పం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తే…
మీరు కన్న కలతో ఆ సంకల్పం పెనవేసుకుని అడుగులు వేస్తే…
విజయం మీదేనంటోంది మీనాబింద్రా.

ఒక డిజైనర్… ఎంటర్ ప్రెన్యూర్ గా అవతరించిన వార్త ఇది. ఇప్పుడు 6 వందల కోట్లకెదిగిన బీబా ఇండస్ట్ర్రీస్ అధినేతైన మీనాబింద్రా.. సరిగ్గా 39 ఏళ్ల వయస్సులో తన హాబీయైన డిజైనింగ్ ను బీబా అప్పారెల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ వ్యవస్థగా ప్రారంభించింది.

ముంబై కేంద్రంగా సరిగ్గా 1983లో తన సంస్థను ప్రారంభించిన మీనా… 2015లో ఇండియన్ అప్పారెల్ ఇండస్ట్రీలోనే ఓ గొప్ప అవార్డ్ గా చెప్పుకునే అపెక్స్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డునందుకుంది.

ఇప్పుడేకంగా బీబా అప్పారెల్ మాల్స్ ని దుబాయ్, లండన్ లలో కూడా తెరిచింది. తను కేవలం ప్యాకెట్ మనీ సంపాదన కోసం బట్టలు కుట్టడం ప్రారంభిచానని… మీరేదైనా అనుకుంటే చేస్తూ వెళ్తుండండి ఫలితాలు వాటంతటవే వస్తాయంటోంది మీనాబింద్రా.

ఇద్దరు పిల్లల తల్లైన 40 ఏళ్ల మీనాబింద్రా సరిగ్గా 33 ఏళ్ల క్రితం ఇంట్లో బట్టలకు డిజైనింగ్ కుట్లు వంటివి ప్రారంభించేందుకు బ్యాంక్ నుంచి ఓ 8 వేల రూపాయల రుణం తీసుకుని తన పనిని ప్రారంభించారు.

ఇవాళ ఆడవాళ్లు ధరించే… ప్రతీ ఇంట్లో మహిళల వార్డ్ రోబ్ లో కనిపించే పంజాబీసూట్స్ కు రూపకర్త మీనాబింద్రానే. అంతేకాదు మహిళలు ధరించే కుర్తాలకు ప్యాకెట్ కల్చర్ ను అలవాటు చేసిన బింద్రా…

2004లో నా తుమ్ జానో న హమ్ సినిమా నుంచి బాలీవుడ్ సినిమాలకూ డిజైనర్ గా పనిచేస్తోంది. బజరంగీ భాయ్ జాన్, దేవదాస్, బాగ్ బన్, హల్చల్ వంటి పలు బాలీవుడ్ సినిమాలకు ఆమె కాస్ట్యూమ్స్ అందించింది. అంతేకాదు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్సైన రోహిత్ బాల్, అంజూమోడీ వంటివారితో టై అప్ అయి తమ బీబా కంపెనీ బ్రాండ్ ఇమేజ్ ను తారాస్థాయికి తీసుకెళ్లుతోంది.

డెబ్బై ఏళ్ల వయస్సులోనూ తన బ్రాండ్స్ ను తాను కూడా ధరిస్తూ… ఒకింత గర్వపడే మీనాబింద్రా… ఓ లక్ష్యంతో బయల్దేరి మార్గమధ్యంలోనే కష్టాలకు ఎదురోడలేక విడిచిపెట్టేవారెందరికో ఓ స్ఫూర్తి. కష్టపడే తత్వముంటే… కచ్చితంగా మీనాబింద్రాలాగా సాధించగలరనడానికి ఆమె ఓ మోడల్.

-రమణ కొంటికర్ల

RELATED ARTICLES

Most Popular

న్యూస్