1.3 C
New York
Thursday, December 7, 2023

Buy now

Homeతెలంగాణరేపటి నుంచే అంటే ఎలా? : హైకోర్టు

రేపటి నుంచే అంటే ఎలా? : హైకోర్టు

హఠాత్తుగా రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఎలా అంటూ తెలంగాణా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఉదయం వరకూ కనీసం వీకెండ్ లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచన కూడా చేయలేదని, కాని ఇప్పుడు 10 రోజుల లాక్ డౌన్ విధించారని, ఇంత తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాల ప్రజలు వారి ప్రాంతాలకు ఎలా వెళ్తారని అసహనం వ్యక్తం చేసింది.

వైద్యంకోసం హైదరాబాద్ కు వస్తున్న రోగులను అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద అడ్డుకోవడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ మెడికల్ హబ్ గా మారిందని. ప్రజలను రావొద్దని చెప్పడానికి ఏం అధికారం వుందని, వైద్యం కోసం వచ్చేవారిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. సరిహద్దుల్లో షుమారు ¬40 నుంచి 50 అంబులెన్సులు వేచి వున్నాయని న్యాయస్థానం పేర్కొంది.

ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఆర్ఎంపి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ తో హైదరాబాద్ కు వస్తున్నారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఈ విషయమై రేపటిలోగా ప్రభుత్వం తరపున నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. రేపటిలోగా ఎంతమంది ప్రాణాలు పోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్