దేశంలో కోవిడ్ తీవ్రతపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం పెట్టాలని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడికి ఖర్గే లేఖ రాశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి సమావేశాలు వర్చువల్ గా నిర్వహించాలని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడిని కూడా మరో లేఖలో కోరారు ఖర్గే.
బడ్జెట్ లో కేటాయించిన 35 వేల కోట్ల రూపాయలు వినియోగించి, ప్రజలందరికి ఉచితంగా వాక్సిన్ ఇవ్వాలని, దీనికోసం వాక్సిన్ తయారి కంపెనీలకు అవసరమైన చేయూత అందించాలని ప్రధానిని కోరారు. ఉపాధి హామీ పని దినాలను 200కి పెంచాలని సూచన చేశారు.
శనివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ప్రధానికి కరోనా పై లేఖ రాశారు. కోవిడ్ నియంత్రణలో కేంద్రం ఘోరంగా విఫలమైందని, ‘ప్రజలు ఓడిపోయేలా’ చేశారంటూ ప్రధానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కూడా ప్రధానికి రాసిన లేఖలో కొత్త వైరస్ లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనిపై శాస్త్రీయ అధ్యయనం జరిపించాలని కోరారు