Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్మానవత్వం ఉన్ననేత వైఎస్: సజ్జల

మానవత్వం ఉన్ననేత వైఎస్: సజ్జల

ప్రపంచ చరిత్రలో మానవత్వం మెండుగా ఉన్న అతికొద్ది మంది నాయకుల్లో వైఎస్సార్ నిలిచిపోతారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా తాదేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్ కు నేతలు ఘంగా నివాళులర్పించారు. మంత్రులు కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ  చరిత్ర పుటల్లో స్వర్ణక్షరాలతో రాయదగిన వ్యక్తి వైఎస్సార్ అని అభివర్ణించారు. సమాజం మీద ప్రేమను చాటడమే కాకుండా కేవలం 5 ఏళ్ళల్లో ప్రజల జీవితాల్లో ఎంత ముద్ర వేయవచ్చో నిరూపించిన వ్యక్తి అని కొనియాడారు. యన నాటిన మొక్కే ఇవాళ జగన్ రూపంలో మహా వృక్షం అయి మన ముందు ఉందన్నారు.

రెండేళ్లుగా సిఎం జగన్  తండ్రికి తగిన తనయుడిగా గొప్ప పరిపాలన అందిస్తూ, అందరికీ సమాన అవకాశాలు కల్పించటానికి చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నారని చెప్పారు. నాన్న ఒకడుగు వేస్తే పది అడుగులు వేస్తాననే విధంగా ఒక అభ్యుదయ వాదిగా జగన్ పరిపాలన అందిస్తున్నారని సజ్జల వెల్లడించారు.  ప్రస్తుతం ఉన్న ఆర్ధిక సంక్షోభ సమయంలో కూడా ప్రపంచమే గర్వపడే విధంగా పాలన చేస్తున్నారని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్