Saturday, September 21, 2024
HomeTrending Newsవిద్యాసంస్థలకు ర్యాంకింగ్స్ ప్రకటించిన కేంద్రం

విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్ ప్రకటించిన కేంద్రం

దేశంలో విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్‌ను కేంద్రం ప్రకటించింది. టాప్ 100 విభాగంలో ఏపీ, తెలంగాణకు చెందిన పలు వర్సిటీలు, కాలేజీలకు చోటు దక్కింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ వర్సిటీకి తొలిస్థానంలో నిలిచింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు 17వ స్థానం, ఆంధ్రా యూనివర్సిటీకి 24, ఎస్వీ యూనివర్సిటీకి 54వ ర్యాంక్‌లు దక్కాయి. పరిశోధన విభాగంలో కర్ణాటకలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ నేషనల్ ఫార్మా ఇన్సిట్యూట్‌కు 6వ స్థానం, హైదరాబాద్ ఐఐటీకి 16, హైదరాబాద్ ఉస్మానియా  యూనివర్సిటీకి 62వ ర్యాంక్, వరంగల్ ఎం ఐ టి కి 59వ స్థానం దక్కింది. ఏపీలోని ఏయూ ఫార్మా కాలేజీకి 30వ ర్యాంక్‌లను కేంద్రం ప్రకటించింది. లా విభాగంలో తెలంగాణ నల్సార్ వర్సిటీకి 3వ ర్యాంక్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్