కరోనా నిర్మూలనలో భారత్ కృషి అమోఘమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. రాబోయే రోజుల్లో కరోన కట్టడికి, ప్రపంచ దేశాలకు సహకారం అందించేందుకు ఇండియా మరింత నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని WHO డైరెక్టర్ జనరల్ టేద్రోస్ అధనోం ఘేబ్రేఎసస్ అన్నారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రీనాట్ సందు WHO డైరెక్టర్ జనరల్ టేద్రోస్ అధనోం ఘేబ్రేఎసస్ తో జెనీవాలో సమావేశమయ్యారు. వైద్య రంగంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారత్ సహకారం, కోవిడ్ కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలు, పేద దేశాలకు వ్యాక్సిన్ పంపిణి,భారత్ సంప్రదాయ మందులతో కరోనా తగ్గుదల వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.
భారత్ లో వ్యాక్సిన్ పంపిణి అర్థవంతంగా సాగుతోందని, భారత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని WHO డైరెక్టర్ జనరల్ టేద్రోస్ అధనోం ఘేబ్రేఎసస్ అబినందించారు. ఇండియాలో సుమారు 75 శాతం జనాభాకు టీకా ఇవ్వటం గొప్ప కార్యక్రమం అన్నారు. మూడో ప్రపంచ దేశాల్లో టీకా పంపిణీకి ఇండియా అనుభవాలు ఉపయోగపడతాయన్నారు.