సెప్టెంబర్ 17 ని బీజేపీ పార్టీ ఒక ఆట వస్తువులాగా అడుకుంటున్నదని శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంలో బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, కాంగ్రెస్ కూడా సెప్టెంబర్ 17 ని గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నది. ఇది సిగ్గుచేటని విమర్శించారు. సర్దార్ వల్ల భాయ్ పటేల్ కు బీజేపీ పార్టీ కి ఏం సంబంధం అని నల్గొండలో ప్రశ్నించారు. బీజేపీ కి దిక్కు దివాన లేక సర్దార్ వల్ల భాయ్ పటేల్ ను తమ నాయకుడిగా ఓన్ చేసుకునే కుటిల యత్నం చేస్తున్నదని, బీజేపీ హిందుత్వాన్ని ప్రోత్సహించాలని ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
ఏం ఐ ఏం పార్టీని భూచిగా చూపెట్టి హిందువులను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు.ఇది మంచి సంప్రదాయం కాదని గుత్తా హితవు పలికారు. అధికారంలోకి వస్తాం అని బీజేపీ వాళ్ళు పగటి కలలు కంటున్నారని, తెలంగాణలో బీజేపీ పార్టీకి స్థానం లేదన్నారు. బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై అడ్డగోలుగా మాట్లాడటం తగదు. బీజేపీ వాళ్ళు రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు గురించి కనీసం మాట్లాడటం లేదన్నారు.
రేవంత్ రెడ్డి నోటికి అడ్డు అదుపు లేదు. బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని గుత్తా ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ దోపిడీకి గురవుతుందని, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు రౌడీ ల్లాగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.