Friday, November 22, 2024
HomeTrending Newsతాలిబన్లను అమెరికా గుర్తించాలి

తాలిబన్లను అమెరికా గుర్తించాలి

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించక పోతే ఈ ప్రాంతంలో కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్ లో రష్యా మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించిన ఇమ్రాన్ ఖాన్ సాధ్యమైనంత తొందరగా తాలిబాన్ ప్రభుత్వం పట్ల అమెరికా సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కు పాకిస్తాన్ సహకారం అందించింది అన్న ఆరోపణలని ఇమ్రాన్ ఖాన్ కొట్టిపారేశారు. ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళుగా జరిగిన పోరాటంలో తాలిబాన్ గెలిచింది, మీడియా ఆరోపణలే నిజమైతే అమెరికా కన్నా పాకిస్తాన్ దేశమే మరింత బలమైనదని అన్నారు. కేవలం అరవై వేల మంది తాలిబాన్ ఫైటర్లు మూడు లక్షల మంది యూరోప్ సైన్యాన్ని ఎదుర్కోవటం అనితర సాధ్యమన్నారు.

ఇతర దేశాల వారిని ఎదుర్కునేటపుడు ఆఫ్ఘన్లు జిహాద్ తరహాలో పోరాడుతారని, 20 ఏళ్ళలో తాలిబాన్ అనేక అనుభవాలు నేర్చుకుందని ఇమ్రాన్ ఖాన్ వివరించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదం మీద పోరాటం పేరుతో పాకిస్తాన్ దేశాన్ని అమెరికా కిరాయి ఆయుధంగా వాడుకుందని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా చేసిన పోరాటం వినాశకరమైనదాని అసంతృప్తి వ్యక్తం చేశారు.

పాకిస్తాన్ ఏనాడు తాలిబాన్ కు సహకరించలేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్