డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్ లకు ఫోరెన్సిక్ సైన్సు ల్యాబ్ (ఎఫ్.ఎస్.ఎల్.) నివేదిక క్లీన్ చిట్ ఇచ్చింది. 2017 లో తెలంగాణా ఎక్సైజ్ శాఖ టాలీవుడ్ కు చెందిన పలువురు నటులు, దర్శకులను విచారించింది, ఈ విచారణ సందర్భంగా పూరీ, తరుణ్ స్వచ్ఛందంగా ఇచ్చిన గోళ్ళు, వెంట్రుకలు, రక్తంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్ళు లభించలేదని నివేదికలో వెల్లడైంది. ఈ విషయమై గత ఏడాది డిసెంబర్ లోనే ఎఫ్.ఎస్.ఎల్. నివేదిక ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.
ఈ మేరకు ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, ఎఫ్.ఎస్.ఎల్. నివేదికను కూడా దానితో జత చేసింది. డిసెంబర్ 9న విచారణకు హాజరు కావాలని కెల్విన్ కు కోర్టు సమన్లు జారీ చేసింది.