Monday, November 25, 2024
HomeTrending Newsఆన్ లైన్ టికెట్ పై సానుకూలం: పేర్ని

ఆన్ లైన్ టికెట్ పై సానుకూలం: పేర్ని

ప్రభుత్వం తలపెట్టిన ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి సినిమా రంగానికి చెందినవారు సమ్మతి తెలిపారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. ప్రభుత్వం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకున్న తరువాత తాము మరోసారి వచ్చి కొన్ని సూచనలు ఇస్తామని ఫిలిం ఛాంబర్ వారు చెప్పారని నాని అన్నారు. నేడు ఏపీ సచివాలయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం అనంతరం నాని మీడియాతో మాట్లాడారు.

పేద, మధ్య తరగతి ప్రేక్షకుడికి వినోదం అందుబాటులో ఉండాలన్నదే జగన్ ప్రభుత్వ దృక్పథమని నాని అన్నారు. మాకున్న సినిమా మోజును సొమ్ము చేసుకుంటున్నారని ఏ ప్రేక్షకుడూ బాధ పడకూడదని,  ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టికెట్లు విక్రయించేలా చేయడమే ప్రభుత్వ అభిమతమని వివరించారు. పారదర్శకత తో కూడిన వ్యవస్థను రూపొందిస్తామన్నారు.

చిరంజీవి అంటే సిఎం జగన్ కు ఎంతో గౌరవం, సోదర భావం ఉన్నాయని వారు వెల్లడించిన అంశాలపై సానుకూల వైఖరితోనే సిఎం ఆలోచన చేస్తారని పేర్ని అన్నారు. నేటి సమావేశంలో ఏ ఒక్కరూ బెనిఫిట్ షో ల గురించి అడగలేదని  స్పష్టం చేశారు.

కాగా, సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ…

⦿ ఏపీ  ప్రభుత్వంతో  చర్చలు సంతోషం.
⦿ మా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఆక్సిజన్  ఇచ్చారు
⦿ అతి  త్వరలో అన్నికార్యక్రమాలు  పూర్తి చేస్తా అన్నారు
⦿  సీఎం జగన్ మంచి  భరోసా ఇస్తున్నారు
⦿ ఈ రోజు మాకు చాలా ఆనందం.
⦿ ఆన్లైన్  టికెట్ వ్యవస్థ కావాలని మేమే ఆడిగాము
⦿ అన్నిసినిమా సమస్యలపై  మంత్రి  పేర్నినాని బాగా స్పందించారు
⦿ తెలుగు  సినిమా  అన్ని  సెక్టార్ మరియు  24  క్రాఫ్ట్  కు  సంబంధించి మంచి  హామీ  ఇచ్చారు.

ఆదిశేషగిరి రావు  నిర్మాత….

⦿ అన్నిరాష్ట్రాల్లో ఆన్లైన్ టికెట్ విధానం ఉంది
⦿ ఏపీలో కూడా అమలు జరపాలని  కోరాము
⦿ సినిమా టికెట్ రేట్లు సవరించాలని  మేము   ఆడిగాము
⦿ సినీ పరిశ్రమకు సంబంధించి అన్నిఅంశాలపై ప్రభుత్వం సుముఖంగా ఉంది

డి.ఎన్.వి  ప్రసాద్….. 

⦿ ప్రభుత్వం సినిమా సమస్యలపై సానుకూలంగా స్పందించింది
⦿ తెలుగు సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుంది
⦿ పెద్ద, చిన్నసినిమా లేదు, ప్రభుత్వానికి ఉన్నడౌట్స్ క్లారిఫై  చేశాం
⦿ సినిమా పరిశ్రమకు ఉన్నసమస్యలపై  మంత్రి పేర్ని నాని, అధికారులతో  చర్చ  జరిగింది.
⦿ తప్పనిసరిగా మరొక సమావేశం ఉంటుంది
⦿ ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ అనేది పెద్ద సమస్య కాదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్