Monday, March 3, 2025
Homeస్పోర్ట్స్కొనసాగుతున్న ఢిల్లీ జోరు

కొనసాగుతున్న ఢిల్లీ జోరు

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. అబుదాబీలోని జయేద్ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ లో  పూర్తి స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయిన ఢిల్లీ జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణించి ఆధిపత్యం నిలబెట్టుకుంది.

టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శామ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.  ఢిల్లీ జట్టు స్కోరు 21 వద్ద ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యారు. శిఖర్-8, పృథ్వీ షా-10 పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత కెప్టెన్ రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ మూడో వికెట్ కు 62 పరుగులు చేశారు. శ్రేయాస్ 32 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్సర్లతో 43;  పంత్-24; హెట్మెయిర్ 16 బంతుల్లో 5 ఫోర్లతో 28పరుగులు చేశారు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.  రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియ చెరో రెండు వికెట్లు, కార్తీక్ త్యాగి, రాహుల్ తవాటియా చెరో వికెట్ పడగొట్టారు.

155 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ వికెట్ల పతనం మొదటి ఓవర్ నుంచే ప్రారంభమైంది. జట్టు స్కోరు 6 పరుగుల వద్ద ఓపెనర్లు లివింగ్ స్టోన్, యశస్వి జైపాల్ ఇద్దరూ ఔటయ్యారు. కెప్టెన్ సంజూ శామ్సన్ నిలకడగా ఆడుతున్నా అతనికి మిగతా బ్యాట్స్ మెన్ నుంచి సహకారం అందలేదు. శామ్సన్ 53 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ తో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఢిల్లీ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్