Friday, November 22, 2024
Homeజాతీయందసరా, దీపావళి సెలవుల్లో విమానాలకు గిరాకీ

దసరా, దీపావళి సెలవుల్లో విమానాలకు గిరాకీ

ఎవరిగోల వారిది అంటే ఇదే. కరోనా మూడో వేవ్ లో ఉన్నామా? లేక క్రమంగా కరోనా తగ్గుతోందా? తెలియని అయోమయం ఇంకా అలానే ఉంది. ఇంకా జాగ్రత్తలు, ఆంక్షలు, వీలయినంత భౌతిక దూరాలు అలానే ఉన్నాయి. పోయిన ఉద్యోగాలు ఎప్పుడొస్తాయో తెలియదు. మూతబడ్డ పరిశ్రమలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. పేదల కష్టాలు, కన్నీళ్లు అలాగే ఉన్నాయి.

సంపన్నుల సమస్యలు మరో రకంగా ఉన్నాయి. పార్టీలు, వీకెండ్ ఉత్సాహాలు, విదేశీ టూర్లు లేక…కాళ్లు చేతులు కట్టేసినట్లు ఉంది. దాంతో రానున్న దసరా, దీపావళి సెలవులకు విదేశాలు తిరిగి రావడానికి విమానాలను అద్దెకు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం చార్టర్డ్ ఫ్లయిట్ బుకింగులు అనూహ్యంగా పెరగడంతో ప్రయివేటు విమాన సర్వీసు కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి.

మాస్కో, మాల్దీవ్స్, దుబాయ్, బాలి, సింగపూర్, శ్రీలంకలకు సాధారణ ప్రయాణికులతో కలిసి వెళ్లి రావడం కంటే…తమ కుటుంబం మాత్రమే ప్రత్యేకంగా ప్రయాణించడానికి వీలుగా విమానాలను అద్దెకు బుక్ చేసుకున్నారు. ఈసారి దసరా, దీపావళికి ఇలాంటి విదేశీ టూర్ల కోసం బుకింగుల్లో 25 శాతం పెరుగుదల ఉందట. “ఉన్నవాడికి తిన్నది అరగదు. లేనివాడికి తిండి దొరకదు”

RELATED ARTICLES

Most Popular

న్యూస్