Monday, March 31, 2025
HomeTrending Newsసచ్చిదానంద ఆశ్రమానికి సిఎం జగన్

సచ్చిదానంద ఆశ్రమానికి సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం విజయవాడ పటమట శ్రీ దత్తనగర్ లోని అవధూత దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. మరకత రాజరాజేశ్వరి దేవిని అయన దర్శించుకోనున్నారు. అక్కడే ఆశ్రమంలో బస చేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద స్వామితో సిఎం భేటీ కానున్నారు.

సిఎం పర్యటన ఏర్పాట్లను శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి భద్రత అధికారులు, ఇతర పోలీసు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. వీరి వెంట సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్, ఏసీపీ హర్షవర్ధన్ రాజు, ఆశ్రమ పర్యవేక్షకులు అవధూత రమేష్, ఎగ్జిక్యూటివ్ ఏ.ఎస్.ఆర్.కె.ప్రసాద్, ట్రస్టు మెంబర్ జి.వి.ప్రసాద్, వియంసి సియంవోహెచ్ డా.జి.గీతబాయ్, తహసీల్దార్ వెంకట్రావు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్