Saturday, November 23, 2024
HomeTrending Newsకారెక్కిన మోత్కుపల్లి నర్సింహులు

కారెక్కిన మోత్కుపల్లి నర్సింహులు

రాబోయే ఎన్నికల్లో కూడా తెరాస గెలుస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మరో రెండేళ్ళు రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో ఈ రోజు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. మోత్కుపల్లికి కండువా కప్పి ఆహ్వానించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సమాజం అత్యంత అట్టడుగుకు దిగజారి పరిస్థితులు చేతులు దాటాయి. అన్యాయానికి గురైన వారికి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. స్వరాష్ట్రంలో గ్రామాలు కళకళ లాడుతున్నాయి. చేనేతల ఆత్మహత్యలు తగ్గాయి. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ మోత్కుపల్లి రాజకీయ అవసరాల కోసం టిఆర్ ఎస్ లో చేరలేదన్నారు. ఇతర పార్టీలకు రాజకీయం అంటే క్రీడ. తెరాస కు మాత్రం రాజకీయం ఓ యజ్ఞం అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందిన నాడే బంగారు తెలంగాణ సాధించినట్టు అని కెసిఆర్ అన్నారు.

 

బలహీన వర్గాలను బలోపేతం చేసేందుకే దళిత బంధు ప్రవేశ పెట్టామని కెసిఆర్ స్పష్టం చేశారు. దళిత బంధు యజ్ఞం ఆగాడు. తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో తెలంగాణ తరహ ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దళితబంధు సన్నాహక సమావేశం కోసం ఆహ్వానించగానే మోత్కుపల్లి వచ్చి తన అనుభవాలు పంచుకున్నారు.

దళిత బంధు ద్వారా దళితుల జీవితాల్లో ఖచ్చితంగా మార్పువస్తుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని కెసిఆర్ అన్నారు. ప్రాణం పోయినా దళితబందు ఆపేదిలేదని కెసిఆర్ అన్నారు. దళితులు ఆత్మ గౌరవంతో బతికేందుకే దళిత బందు పథకం తీసుకోచ్చామన్నారు. దళిత బంధు కోసం లక్షా డెబ్బై వేల కోట్లు కేటాయిస్తే దాని ద్వారా తెలంగాణకు పది లక్షల కోట్ల ఆదాయం రానుంది. తెలంగాణ దళిత సమాజం దేశ దళిత సమాజానికి మార్గదర్శకమవుతుంది. దీని తర్వాత గిరిజన బంధు ఆ తర్వాత బిసి బంధు తదితర కార్యక్రమాలు చేపడతామన్నారు. తెలంగాణ సమాజంలో పెద్ద కులం దళితులే కాగా భూమి మాత్రం వారి దగ్గరే తక్కువగా ఉంది. దళిత బంధు కమిటీల ద్వారా అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలి.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్