ఈ వార్త చదవడానికి, ఈ వీడియో చూడడానికి మనసుకు కష్టంగా ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రైల్లో ఒక తల్లి తన పసికందును ఒళ్లో పెట్టుకుని ఒద్దికగా, భద్రంగా బోగీలో నేలమీద కూర్చుని ఉంది. పక్కన, ఎదురుగా సీట్లల్లో ఎక్కువగా యువతులు కూర్చుని ఎవరికి వారు సెల్ ఫొన్లలో మునిగిపోయి ఉన్నారు.
గాయపడిన గుండె ఏదో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి…
“సంస్కారం లేని చదువులు;
బాధ్యత లేని బతుకులు”
అని క్యాప్షన్ పెట్టి సమాజాన్ని ప్రశ్నించింది. మెట్రో రైల్ ఎం డి కూడా స్పందించి…అవును తలదించుకోవాల్సిన ఉదంతమిది. ఆ తల్లికి సీటు ఇచ్చి ఉండాల్సింది…అని బాధ పడ్డారు.
నిజమే.
అందరం తలదించుకుందాం.
సిగ్గుతో అయినా ఆ తల్లికి క్షమాపణలు చెబుదాం. లేకుంటే మనం ఒక తల్లి బిడ్డలం అని చెప్పుకునే హక్కును కోల్పోతాం.