Wednesday, April 2, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్నేడు మత్స్యకార భరోసా

నేడు మత్స్యకార భరోసా

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని వరసగా మూడో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. నేడు క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాలలో నగదు జమ చేయనున్నారు.

మత్స్యకారులకు వేట నిషేద సమయంలో (ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు) ఏటా రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం కింద ఈ ఏడాది 1,19,875 మత్స్యకార కుటుంబాలకు మొత్తంరూ. 119.88 కోట్ల ఆర్ధిక సాయం అందనుంది.

కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్‌ వల్ల ఆర్ధిక భారం ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతీ హమీని భాద్యతగా నెరవేరుస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. గతంలో కేవలం రూ. 4వేలు మాత్రమే ఇచ్చేవారని, దాన్ని రూ. 10 వేలకు పెంచి అర్హులైన మర, యాంత్రిక పడవలతో పాటు సముద్రంలో సాంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకారులకు కూడా భృతి చెల్లిస్తున్నమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

2019 నుంచి ఇప్పటివరకు రూ. 211.70 కోట్ల భృతి చెల్లింపు, వరసగా మూడో ఏడాది నేడు అందిస్తున్న రూ. 119.88 కోట్లతో కలిపి మొత్తంగా దాదాపు రూ. 332 కోట్లు లబ్ధి చేకూరుస్తోంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్