సింగపూర్ కు విమాన సర్వీసులు వెంటనే నిలిపి వేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సింగపూర్ లో మొదలైన స్ట్రెయిన్ చిల్ల పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఆ స్ట్రెయిన్ మన దేశంలోకి రాకుండా చూడాలని కోరారు. ఈ స్ట్రెయిన్ ను మూడో దశగా భావించి వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారులకు కూడా వాక్సిన్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని కేజ్రివాల్ సూచించారు,
మరోవైపు, కరోనా మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం ఆర్ధిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఆర్ధిక సాయం చేస్తామని, తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందిస్తామని కేజ్రివాల్ ఓ ప్రకటనలో వేల్లటించారు. రేషన్ కార్డు ఉన్న వారందరికీ 10 కిలోల బియ్యం ఇస్తామని, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఎక్స్ గ్రేషియా తో పాటు నెలకు 2,500 రూపాయల సాయాన్ని వారికి 25 ఏళ్ళ వయసు వచ్చే వరకూ అందిస్తామని కేజ్రివాల్ ప్రకటించారు.