Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్రవి శాస్త్రి స్థానంలో ద్రావిడ్ నియామకం

రవి శాస్త్రి స్థానంలో ద్రావిడ్ నియామకం

BCCI Officially Declared Rahul Dravids Appointment As Head Coach : 

భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిద్ నియమితులయ్యారు. ద్రావిడ్ నియామకం గత నెలలోనే ఖరారైనప్పటికీ లాంఛనాలు పూర్తి చేసి నేడు అధికారికంగా ప్రకటించారు. సులక్షణ నాయక, ఆర్పీ సింగ్ లతో కూడిన భారత క్రికెట్ సలహా మండలి ద్రావిడ్ ను టీమిండియా (పురుషుల సీనియర్లు) జట్టుకు హెడ్ కోచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు  వెల్లడించింది.

ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ద్రావిడ్ ఒక్కరే దరఖాస్తు చేయడంతో ఆయన్ను ఎంపిక చేశారు. ప్రస్తుతం జరుగుతోన్న టి20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే ద్రావిడ్ ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నెల 17 నుంచి స్వదేశంలో న్యూ జిలాండ్ తో జరిగే రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కు అయనే కోచ్ గా వ్యవహరిస్తారు.

రవి శాస్త్రి హెడ్ కోచ్ గా చేసిన సేవలను బిసిసిఐ కొనియాడింది, అయన నేతృత్వంలో జట్టు ఎన్నో కీలక సిరీస్ లను, విజయాలను నమోదు చేసిందని ప్రసంశించింది.

Must Read :29న బిసిసిఐ కీలక భేటి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular