Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఇంగ్లాండ్ పై అద్భుత విజయం : ఫైనల్లో న్యూజిలాండ్

ఇంగ్లాండ్ పై అద్భుత విజయం : ఫైనల్లో న్యూజిలాండ్

New Zealand Entered Into T20 Final After Stunning Win Against England :

న్యూజిలాండ్ జట్టు ఐసిసి టి 20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. అబుదాబీలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి టైటిల్ పోరులో నిలిచింది. న్యూజిలాండ్ ఓపెనర్ డెరిల్ మిచెల్ 47 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలవగా, కొంత కాలంగా ఆల్ రౌండ్ ప్రతిభతో రాణిస్తోన్నజేమ్స్ నీషమ్ మరోసారి సత్తా చాటాడు, కేవలం 11 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్సర్లతో 27 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. డేవాన్ కాన్వె కూడా 38 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్ తో 46 పరుగులతో రాణించాడు.

ఇంగ్లాండ్ విసిరిన 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది, కొంతకాలంగా రాణిస్తోన్న ఓపెనర్ గుప్తిల్ ఒక ఫోర్ మాత్రమే కొట్టి క్రిస్ ఓక్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మూడో ఓవర్లో కెప్టెన్ విలియమ్సన్(5) ను కూడా ఓక్స్ అవుట్ చేశాడు. ఈ స్థితిలో మిచెల్, కాన్వె తో కలిసి మూడో వికెట్ కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.  కాన్వె అవుట్ అయిన తరువాత గ్లెన్ ఫిలిఫ్స్(2) కూడా వెంటనే ఔటయ్యాడు. కివీస్ ఆటగాళ్ళు ఆచి తూచి ఆడుతుండడంతో కావాల్సిన రన్ రేట్ పెరుగుతూ వచ్చింది.  మ్యాచ్ 16  ఓవర్ల వరకూ ఇంగ్లాండ్ వైపే మొగ్గు ఉంది. క్రిస్ జోర్డాన్ వేసిన 17 ఓవర్లో నీషమ్ ఒక ఫోర్, రెండు సిక్సులతో మొత్తం 19 పరుగులు రాబట్టగా, మరో నాలుగు పరుగులు ఎక్స్ ట్రా గా.. మొత్తం 23 పరుగులు లభించాయి. ఈ ఓవర్ ఇంగ్లాండ్ కు విజయాన్ని దూరం చేసింది.

అంతకుముందు, న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలర్లు మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడంతో పవర్ ప్లే లో  పరుగులు రాబట్టడానికి ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఇబ్బంది పడ్డారు.  జట్టు స్కోరు 37 వద్ద బెయిర్ స్టో (13) ఔటయ్యాడు.  ఆ కాసేపటికే 29 పరుగులు చేసిన బట్లర్ కూడా వెనుదిరిగాడు. ఈ దశలో డేవిడ్ మలాన్, మొయిన్ అలీ లు స్కోరు వేగం పెంచారు. మూడో వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ తో 41 పరుగులు  చేసి మలన్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన లివింగ్ స్టోన్ 10 బంతుల్లో ఒక ఫోర్ ఒక సిక్సర్ తో 17 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. మొయిన్ అలీ  అర్ధసెంచరీ సాధించాడు, 37 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. నిర్ణీత 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 స్కోరు చేసింది.

డెరిల్ మిచెల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : నమీబియాపై న్యూజిలాండ్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్