Saturday, November 23, 2024
HomeTrending Newsసింగరేణి దుర్ఘటనపై నేతల దిగ్బ్రాంతి

సింగరేణి దుర్ఘటనపై నేతల దిగ్బ్రాంతి

 Accident Took Place At The Singareni Coal Mine 

సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని  శ్రీరాంపూర్ సింగరేణి ఎస్ఆర్పీ-3 గనిలో చోటుచేసుకుంది. కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కార్మికులపై పైకప్పు కూలింది.

ఉదయం షిప్ట్‌లో విధులకు వచ్చిన కృష్ణారెడ్డి (59), లక్ష్మయ్య (60), సూర్య నరసింహ రాజు (30), చంద్రశేఖర్ (29) అనే కార్మికులపై గని పై కప్పు కూలింది. దీంతో వారు గనిలోనే మరణించారు. మృతదేహాలను వెలికితీయడానికి సింగరేణి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. రాత్రి పది గంటలకు మృతదేహాలు బయటకు తీసుకొచ్చారు.

ఈ దుర్ఘటనపై మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తీవ్ర దిగ్బ్రాతి వ్యక్తం చేశారు. కార్మిక కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భాదిత కుటుంబాలకు భరోసానిచ్చారు. గని ప్రమాద దుర్ఘటనపై సింగరేణి సిఎండి శ్రీధర్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన సిఎండి శ్రీధర్ చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి సింగరేణిలో ఉద్యోగం ఇస్తామని, వారు కోరుకున్న విభాగంలో పోస్టింగ్ ఇస్తామని వెల్లడించారు.

Also Read : బూడిదే మిగిలింది!

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్