Cyclone In Northern Tamil Nadu And Southern Andhra Pradesh :
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నాటికి ఇది బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంద్ర జిల్లాలకు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అల్పపీడనం ప్రభావంతో చెన్నై లో రాత్రి నుంచి వర్షం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చెన్నై తో పాటు 15 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు, విల్లుపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. పుదుకోట్టై, తిరువారురు,తేన్ కాశీ, తిరునల్వేలి, కన్యాకుమారి, మధురై, రామనాధపురం, శివ గంగై జిల్లాలకు వర్షం ముప్పు పొంచి ఉంది. చెన్నై నగరంలో మూడు ఎన్. డి. ఆర్.ఎఫ్ బలగాలు మోహరింపు. భారీ వర్షాల కారణంగా 12 జిల్లాల్లో నేడు, రేపు స్కూల్స్ సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం. కన్యాకుమారి నుంచి చెన్నై మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ. భారీ వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తున్న కావేరి నది, వైగై, థెన్- పెన్నై, భవానీ నదులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సహాయ బృందాలు.
Also Read : తమిళనాడు, ఏపీల్లో రేపటి నుంచి భారీ వర్షాలు