Protests In Bangladesh To Stop Chinese Government Attacks On Minorities
చైనా ప్రభుత్వం మైనారిటీలపై దాడులు ఆపాలని టిబెటన్లు, ఉయ్ఘుర్ ముస్లీంలకు మద్దతుగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉయ్ఘుర్ ల స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని బంగ్లాదేశ్ లోని అన్ని నగరాల్లో సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పు తుర్కిమినిస్తాన్ ఆక్రమించిన దాన్ని జిన్జియాంగ్ ప్రావిన్సుగా మార్చి చైనా అక్కడ మానవ హననం సాగిస్తోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉయ్ఘుర్ ముస్లీంల జనాభా తగ్గించేందుకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటం, ప్రశ్నించిన వారిని కిడ్నాప్ చేసి అంతమొందించటం దారుణమని ఆందోళనకారులు విమర్శించారు.
బంగ్లాదేశ్ సోషల్ ఫోరం, ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్ధి సంఘాలు, ముక్తిజోద్ద మంచ్ తదితర సంస్థలతో పాటు అనేక మసీదుల్లో ఉయ్ఘుర్ లకు మద్దతుగా ఆందోళనలు చేపట్టారు. రాజధాని ఢాకా, చిట్టగాంగ్, సిల్హెట్, రాజశాహి నగరాలతో పాటు పట్టణాల్లో కూడా నిరసనలు చేశారు. ఢాకాలో చైనా దురాగతాలను వ్యతిరేకిస్తూ భారీ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చైనా సఖ్యతగా ఉంటె దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొన్నేళ్లుగా భారత పొరుగు దేశాలన్నింటిని చైనా మచ్చిక చేసుకొని ఏదోవిధంగా ఇండియాను ఇబ్బంది పెట్టాలని డ్రాగన్ కుయుక్తులు పన్నుతోంది. సరిహద్దుల అంశంలో నేపాల్ తో అదే కుట్ర చేసినా ఆ తర్వాత చైనా తమ దేశంలో పాగా వేయటాన్ని నేపాలిలు, ఆ దేశ ప్రభుత్వం గుర్తించటంతో విభేదాలు తలెత్తాయి. శ్రీలంకలో హంబంతోట రేవు అంశంలో చైనా స్వార్థపూరిత విధానాలు సింహళ ప్రభుత్వం పసిగట్టింది. ఇన్నాళ్ళు భారత్ తో దూరంగా ఉన్న లంక ఇప్పుడు మళ్ళీ స్నేహ హస్తం అందిస్తోంది.
ఇవి కూడా చదవండి: టిబెట్లో చైనా కుట్ర