Saturday, November 23, 2024
HomeTrending Newsబండి సంజయ్ పర్యటన ఉద్రిక్తం

బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తం

Bandi Sanjay Nalgonda Tour Tension :

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ జిల్లా పర్యటనలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆయన తన పర్యటన కొనసాగించారు. బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ దగ్గరకు పెద్ద సంఖ్యలో  చేరుకున్నారు. దీంతో బండి సంజయ్ పర్యటనను అడ్డుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా భారీగా అక్కడకు చేరుకున్నాయి. ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని బండి సంజయ్ సందర్శిస్తున్న సమయంలో.. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నించారు. సంజయ్ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్లజెండాలు ప్రదర్శించారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణులపైకి దూసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు.

దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు… పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. ఉద్రిక్తతల నడుమనే ధాన్యం రాశులను బండి సంజయ్ పరిశీలించారు. దీంతో శెట్టిపాలెంలో భారీగా పోలీసులను మోహరించారు.

ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ నియంత పాలన కొనసాగదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ సమస్య పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని  ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారని, ప్రజల దృష్టి మరల్చేందుకు భయానక వాతావరణం సృష్టించాలని చూస్తే బీజేపీ భయపడే ప్రసక్తే లేదన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలే రైతుల్లాగా వచ్చి గొడవలు చేస్తున్నారని ఆరోపించారు. వానాకాలంలో మొత్తం పంటను ప్రభుత్వం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేస్తే సీఎం ఏం చేస్తారని ప్రశ్నించారు. రైతుల కోసం రాళ్ల దాడికి సిద్దమేనని బండి సంజయ్ ప్రకటించారు.

మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం

మరో వైపు బండి సంజయ్ పర్యటనపై జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని ఖండిస్తున్నామన్నారు. బండి సంజయ్ వంద కార్లలో గుండాలను తీసుకొచ్చి రైతులపై దాడులు చేస్తున్నారని, గత ఆరు సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతొందన్నారు. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో బండి సంజయ్ చిచ్చు పెడుతుండని, పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని బండి సంజయ్ కేంద్రంతో చెప్పించాలన్నారు.

Also Read :  ప్రజా సమస్యలపై యుద్ధమే – బండి సంజయ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్