Catherine Tresa Is Another Herion In Macherla Niyojakavargam :
విభిన్న కథలు చేస్తోన్న హీరో నితిన్ ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతోన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో నితిన్ ను ఫుల్ యాక్షన్ మోడ్ లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతోన్నారు. ఇందులో కృతి శెట్టి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. తాజాగా కేథరిన్ థ్రెసాను మరో హీరోయిన్ గా చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లోనే కేథరిన్ థ్రెసా పాల్గొనబోతున్నారు. కేథరిన్ థ్రెసా, నితిన్ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే.
భీష్మ, మాస్ట్రో వంటి చిత్రాల తరువాత మూడోసారి మహతి స్వరసాగర్ నితిన్ సినిమాకు పని చేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్ గా, మామిడాల తిరుపతి మాటల రచయితగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read : ఏప్రిల్ 29న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’