Friday, November 22, 2024
HomeTrending Newsబ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్ లో చేర్చాలి : సోనియా

బ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్ లో చేర్చాలి : సోనియా

దేశాన్ని వణికిస్తున్న మరో తాజా వ్యాధి బ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్ భారత్ పథకం లో చేర్చాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడికి ఆమె లేఖ రాశారు. ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకొని మ్యూకోర్ మైకోసిస్ (బ్లాకు ఫంగస్) బారిన పడ్డ వేలాది మంది నిరుపేదలకు ఊరట ఇవ్వాలని కోరారు. బ్లాకు ఫంగస్ నివారణ మందులను పెద్ద ఎత్తున అందుబాటులో వుంచి రోగుల ప్రాణాలు కాపాడాలని కోరారు.

బ్లాక్ ఫంగస్ ను ఎపిడమిక్ డిసీజ్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో, ఈ వ్యాధి నివారణకు అవసరమైన మందులను రోగులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రధానికి సూచించారు.
కోవిడ్ నుచి కోలుకున్న డయాబెటిక్ రోగులు, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునే వారు ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్