మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ కేబినేట్ నిర్ణయం తీసుకొని ఉంటె దాన్ని స్వాగతిస్తామని బిజెపి ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఏదైనా ఒక విషయంలో చట్ట వ్యతిరేకం వేరు, అసలు చట్టాన్ని తుంగలో తొక్కడం వేరని, మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలో తొక్కి ఈ బిల్లు తీసుకొచ్చారని అన్నారు. ఆర్ధికంగా, న్యాయపరంగా ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం మరో దొంగచాటు బిల్లు తెస్తుందని తాను అనుకోవడంలేదన్నారు. నిజాయతీగా ప్రభుత్వం బిల్లు వెనక్కి తీసుకుంటే ఎలాంటి తప్పు లేదన్నారు.
ఇది ఎవరి విజయంగానో తానూ భావించడంలేదని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆహ్వానించాలని, విజయోత్సవాలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.