AAP Sp Alliance In Uttar Pradesh :
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉత్తరప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచుగా ఉత్తరప్రదేశ్ సందర్శిస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు బిజెపి జాతీయ నేతలు, ఆర్.ఎస్.ఎస్ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రోజు ప్రజల్లోనే ఉంటున్నారు. మరోవైపు సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాలేజి విద్యార్థుల నుంచి మహిళలు, యువతతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ, వారికి అండగా ఉంటానని అఖిలేష్ భరోసా ఇస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ దళ్ తో సమాజ్ వాది సీట్ల పొట్టు కొలిక్కి వచ్చింది. ఆర్ ఎల్ డి అధినేత జయంత్ చౌదరితో అఖిలేష్ ఎన్నికల సంప్రదింపులు ఫలప్రదం అయ్యాయి. అది జరిగిన మరుసటి రోజే అమ్ ఆద్మీ పార్టీ తో ఎస్పి సీట్ల పంపకాలపై చర్చలు ప్రారంభించటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆప్ నేత సంజయ్ సింగ్ లక్నోలో అఖిలేష్ యాదవ్ తో ఈ రోజు సమావేశం అయ్యారు. వారి సమావేశంలో ప్రధాన అజెండా ఏంటి అనేది సాయంత్రం వరకు బయటకు పొక్కలేదు.
సీట్ల పంపకాలు, పొత్తుల పైనే చర్చలు జరిగాయని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవిద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ను బిజెపి కబంద హస్తాల నుంచి విడిపించేందుకు ఆప్,ఎస్పి లు జతకడుతున్నాయని కేజ్రివాల్ ఢిల్లీ లో వెల్లడించారు. చర్చలు కొలిక్కి వచ్చాయని రాబోయే ఎన్నికల్లో ప్రజలు బిజెపి కి గుణపాటం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని కేజ్రివాల్ అన్నారు. బిజెపి మతోన్మాద రాజకీయాలు, యోగి ఆదిత్యనాథ్ నియంతృత్వం నుంచి ఉత్తరప్రదేశ్ స్వేఛ్చ వాయువులు తీసుకునేందుకు ఈ పొత్తులు దారితీస్తాయన్నారు.
Also Read : అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన