దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయటం లేదని, రాజ్యాంగం అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం నిమ్న వర్గాలకు చేయూత ఇవ్వటం లేదన్నారు. అందుకే ఈ రోజు(గురువారం) ఢిల్లీ పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో బిఎస్పి పాల్గొనలేదని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం అమలవుతుందా లేదా అనే అంశంపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని మాయావతి లక్నోలో అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిర్వహించిన వేడుకలను దేశంలో అనేక పార్టీలు బహిష్కరించిన అంశాన్ని మాయావతి గుర్తు చేశారు. కాంగ్రెస్, వామపక్షాలు, ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ లు వేడుకలకు దూరంగా ఉండటం దేనికి సంకేతమని మాయావతి కేంద్రాన్ని ప్రశ్నించారు.
Also Read : రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం