Lakshya -Trailer :
యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగశౌర్య రీసెంట్ గా ‘వరుడు కావలెను’ తో సక్సెస్ సాధించారు. ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాకి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. డిసెంబర్ 10న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాగశౌర్య చేతికి గాయమైనా కూడా ట్రైనింగ్ సెషన్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఇందులో నాగ శౌర్య ఎయిట్ ప్యాక్ బాడీ అందరినీ ఆకట్టుకుంటుంది.
విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య.. ఇదివరకెన్నడూ కనిపించని కొత్త అవతారంలో, రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న కథా నేపథ్యంతో సంతోష్ జాగర్లపూడి ప్రయోగం చేసేందుకు రాబోతోన్నారు. కాళ భైరవ సంగీతాన్ని సమకూర్చగా.. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : డిసెంబర్ 10న నాగ శౌర్య ‘లక్ష్య’