Sunday, January 19, 2025
HomeTrending Newsధాన్యం సేకరణపై కేంద్రం అస్పష్ట విధానం

ధాన్యం సేకరణపై కేంద్రం అస్పష్ట విధానం

రైతుల సంక్షేమ పథకాల్లో దేశానికే మార్గదర్శి సీఎం కేసీఆర్ కాగా ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీ పార్టీనే అని శాసన మండలి మాజీ ఛైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్  రెడ్డి విమర్శించారు. రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్.సీ.ఐ గోదాముల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని వెంటనే తరలించాలని ఈ రోజు నల్గొండలో డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ పై కేంద్రం స్పష్టమైన ప్రకటన పార్లమెంట్ లో చేయాలన్నారు.

ఈ నెల 10వ తేదిన జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థి కోటిరెడ్డిని గెలిపించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గతంలో కంటే స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ గౌరవ వేతనం భారీగా పెంచారు, స్ధానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ప్రెస్ మీట్ లో  మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,జడ్పి ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్