బకాయిల చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని బకాయిలు చెల్లించాలని సంబంధిత వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి అనుప్రియ పటేల్ ని చేవెళ్ళ లోక్ సభ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, సహచర లోక్ సభ సభ్యులు పసునూరి దయాకర్, వెంకటేష్ నేత, మాలోత్ కవిత లతో కలిసి లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసీఆర్ తీసుకుంటున్న చర్యలను సభ దృష్టి కి తీసుకెళ్లారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలను ఎంపీ రంజిత్ రెడ్డి వివరించారు. పరిశ్రమల స్థాపనలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందని ఎంపీ రంజిత్ సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఇదిలా ఉండగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అనుప్రియ పటేల్ తెలంగాణ ఎంపీ లకు రాత పూర్వకంగా సమాధానమిస్తూ… పెండింగ్ లో ఉన్న వివిధ పథకాల బకాయిలను చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం 56,027 కోట్లు విడుదల చేయగా అందులో MEIS పథకం కిందరూ. 33,010 కోట్లు, SEIS పథకం కింద రూ.10,002 కోట్లు, రాష్ట్ర, కేంద్ర పన్నుల రాయితీ.రూ 5,286 కోట్లు, రాష్ట్ర స్థాయిలో రూ. 330 కోట్లు, ఉత్పత్తుల పన్నుల మినహాయింపు క్రింద 2,568 కోట్లు ఇతర పథకాల ద్వారా 4,831 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అట్లాగే ఈ బకాయిల చెల్లింపుల ప్రయోజనాల దృష్ట్యా 45000 కోట్లు బకాయిదారులకు పంపిణీ చేయబడతాయన్నారు. బకాయిల చెల్లింపులో కూడా బకాయి దారుల అర్హత ప్రమాణాలను చూసే చెల్లిస్తాం అని మంత్రి ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి వివరణ ఇచ్చారు.
Also Read : బియ్యం సేకరణపై లోకసభలో…