Friday, February 23, 2024
HomeTrending Newsమేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు

మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర… మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భక్తులకు వసతుల కల్పన, ఏర్పాట్లపై నేడు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్  పర్యవేక్షణ చేశారు. మేడారం అమ్మవార్లు సమ్మక్క – సారలమ్మలను దర్శించుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు కావల్సిన స్నానఘట్టాలు, దుస్తుల మార్పిడి గదులు, ప్రమాదాలు సంభవించకుండా తీసుకుంటున్న చర్యలు, భక్తుల వసతి సౌకర్యాలపై మేడారం ప్రాంతమంతా తిరిగి పర్యవేక్షించారు. జరుగుతున్న పనులు, చేయాల్సిన పనులపై స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, నేతలతో సమీక్ష చేశారు. మంత్రితో పాటు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఎమ్మెల్యే శ్రీమతి సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

Also Read : ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదన

RELATED ARTICLES

Most Popular

న్యూస్