భారత్ నుంచి జపాన్ వెళ్ళే ప్రయాణికులు ఇకనుంచి పది రోజుల పాటు ఐసొలేషన్ లో ఉండాలని ఆ దేశ ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశలో కరోనా వేరియంట్ దక్షిణాసియా లో తీవ్రంగా ప్రభావం చూపుతోందని జపాన్ పేర్కొంది. దీంతో ఇటివల వ్యాపార వ్యవహారాలపై దక్షిణాసియా దేశాల్లో పర్యటించిన అనేక మంది పది రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తోంది.
ఇండియా నుంచి జపాన్ చేరుకునే ప్రయాణికులు గతంలో ఆరు రోజులు మాత్రమే క్వారంటైన్ ఉంటే సరిపోయేది. తాజా నిభందనలు భారత్ , శ్రీలంక, పాకిస్థాన్ , మాల్దీవులు, నేపాల్ దేశాలకు వర్తిస్తాయని పేర్కొన్నారు. అయితే కజకిస్థాన్, ట్యునీషియా దేశాల నుంచి వచ్చేవారికి మూడురోజుల క్వారంటైన్ ఉంటుందని జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.