Tuesday, November 26, 2024
HomeTrending Newsవింటర్ ఒలంపిక్స్ కు దూరంగా ఆస్ట్రేలియా

వింటర్ ఒలంపిక్స్ కు దూరంగా ఆస్ట్రేలియా

Australia Away From The Winter Olympics :

చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఎకమవ్తుతున్నాయి. వచ్చే ఏడాది చైనాలో జరిగే వింటర్ ఒలంపిక్స్ ను ఇప్పటికే కొన్ని దేశాలు బహిష్కరించగా తాజాగా ఆ జాబితాలో ఆస్ట్రేలియా చేరింది.  దేశంలో మానవ హక్కులు కాలరాస్తూ, పొరుగు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న చైనా ఆయుధ పోటీకే తెరలేపుతోందని ఆస్ట్రేలియా విమర్శించింది. చైనా పేద పోకడలు నిరసిస్తూ బీజింగ్ ఒలంపిక్స్ కు దూరంగా ఉంటున్నామని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ఇందులో సంచలనం ఏమి లేదని, దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోర్రిసన్ వెల్లడించారు. చైనాతో దౌత్య సంబంధాల వ్యవహారంలో ఆస్ట్రేలియా రాజకీయ నాయకులు, రాయబారులు ఈ మేరకు అభిప్రాయం ప్రకటించారన్నారు.

టిబెట్ లో మానవ హక్కుల ఉల్లంఘన, జింజియాంగ్ ప్రావిన్సులో వుయ్ఘుర్ ముస్లీంలను చైనా పాలకులు తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేస్తున్నారు. హాంకాంగ్ లో ప్రజాస్వామ్య వాదులను జైలులో వేయటం లేదంటే అంతమొందించటం షరా మామూలు అయింది. తైవాన్ సరిహద్దుల్లో సైనిక బలగాల మోహరింపు ఏ క్షణంలో ఎం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత నెలకొంది. భారత సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, అంతర్జాతీయ సరిహద్దుల్లో నిర్మాణాలపై చైనా అంతర్జాతీయ సమాజం నుంచి నిరసనలు ఎదుర్కొంటోంది.

చైనా వింటర్ ఒలంపిక్స్ లో పాల్గొనబోమని ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లతో పాటు తైవాన్, జపాన్ తదితర దేశాలు ప్రకటించాయి. కొన్ని దేశాలు క్రీడాకారులను పంపినా అధికారులను, రాయాబారులను వేడుకలకు పంపమని చైనాకు తెగేసి చెప్పాయి.

Also Read : చైనాకు తైవాన్ సెగ

RELATED ARTICLES

Most Popular

న్యూస్