విశాఖను వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. గత ఏడాది ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదం ఘటన మరువక ముందే నేడు హెచ్ పి సి ఎల్ లో భారీ అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దట్టంగా పొగ అలముకొంది. అగ్నిమాపక దళం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొంది.
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఉద్యోగులను బైటకు పంపారు. పేలుడు సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ శబ్దానికి తీవ్ర భయాందోళన లకు గురయ్యారు.
కొత్తగా నిర్మిస్తున్న చిమ్నీలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. ప్రమాదం గుర్తించిన వెంటనే అధికారులు మూడుసార్లు సైరన్ మూగించారు. ఈ సమయంలో కంపెనీలో 100 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం .సైరన్ పలుసార్లు మోగించిన దృష్ట్యా ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొహన్ రెడ్డి అరా తీశారు.