Center is overlooking:
తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. మొన్నటి వరకూ ధాన్యం కొనుగోళ్ళ విషయంలో మోసం చేసిందని, ఇప్పుడు సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే సింగరేణి గనుల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుందని అన్నారు. కోల్ బ్లాక్ ల వేలం వేయవద్దని ఇప్పటికే సిఎం కేసియార్ కేంద్రానికి లేఖలు రాశారని, సింగరేణి కార్మికులు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న కేంద్రం కనీసం స్పందించలేదన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో బిజెపి నేతలు తమ వంతు కృషి చేయాలని సుమన్ డిమాండ్ చేశారు.
బిజెపి తెలంగాణాలోని కార్మికులు, కర్షకులతో పెట్టుకుందని, ఆ పార్టీ రాజకీయంగా దెబ్బతినడం ఖాయమని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని, లాభాల్లో ఉన్న సంస్థలను అమ్ముతోందని విమర్శించారు. తెలంగాణా బిజెపి ఎంపీలు చేతగానివారని వ్యాఖ్యానించిన జీవన్ రెడ్డి వారికి సత్తా ఉంటే బొగ్గు గనుల వేలం ఆపాలని సవాల్ చేశారు. తెలంగాణాలో బిజెపి త్వరలోనే టులేట్ బోర్డు పెట్టుకుంటుందని అయన స్పష్టం చేశారు.
Also Read : విజయం మాదే: జగదీశ్ రెడ్డి