Khiladi on completion:
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ‘ఖిలాడీ’ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసి భారీ సెట్లో రేపటి నుంచి రవితేజ, మీనాక్షి చౌదరిలపై పాటను చిత్రీకరించనున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను రూపొందిస్తున్నారు.
ఇక మరొక పాటకు సంబంధించిన షూటింగ్ మాత్రం మిగిలి ఉంది. టాకీ పార్ట్ ఇది వరకే పూర్తి కాగా.. ఈ డిసెంబర్ చివరి కల్లా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు.
‘ప్లే స్మార్ట్’ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదల కాగా.. విశేషమైన స్పందన లభించింది. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read : ‘ఖిలాడి’ తో కిక్ ఇస్తోన్న రవి తేజ