Saturday, April 20, 2024
HomeTrending Newsబిజెపి ఆఫీస్ ఎదుట ధర్నా చెయ్యి: అంబటి

బిజెపి ఆఫీస్ ఎదుట ధర్నా చెయ్యి: అంబటి

Its Center to decide on Steel Plant:
విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయవద్దనే తాము కూడా కోరుతున్నామని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆస్తి అని, కేంద్రాన్ని పవన్ నిలదీయాలని సూచించారు.  బిజెపితో పొత్తులో ఉన్న పవన్ స్టీల్ ప్లాంట్ పై ఆ పార్టీతో ఎందుకు మాట్లాడరని, మిత్రులను అడిగే ధైర్యం లేనివాళ్ళకు తమను ప్రశ్నించే హక్కు ఎక్కడిదని రాంబాబు అన్నారు. తాము ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్రంపై పోరాటం చేస్తున్నామని, పవన్ కు దమ్ము, చిత్తశుద్ధి ఉంటే ప్లే కార్డు పట్టుకుని బిజెపి కార్యాలయం ఎదుట నిలబడాలని రాంబాబు హితవు పలికారు. నేటి దీక్ష సందర్భంగా పవన్ వ్యాఖ్యలపై అంబటి స్పందించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం దీక్ష చేసిన పవన్ కళ్యాణ్  తన ప్రసంగంలో స్టీల్ ప్లాంట్ గురించి తక్కువ మాట్లాడారని, వైసీపీ గురించే  ఎక్కువ సేపు మాట్లారారని అంబటి ఎద్దేవా చేశారు. రాష్ట్రం కూడా అప్పుల్లో ఉంది కాబట్టి ప్రైవేటీకరణ చేస్తారా అంటూ పవన్ ప్రశ్నించడం అతని అవగాహనా రాహిత్యమని, కేంద్ర ప్రభుత్వ అప్పులు 121 లక్షల కోట్ల రూపాయలని,  మరి దేశాన్ని కూడా అమ్మేయాలని పవన్ ఉద్దేశమా అని అంబటి నిలదీశారు.

గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన పవన్ ఈసారి మూడు చోట్ల పోటీ చేయవచ్చని అంబటి సలహా ఇచ్చారు. అయన ఎప్పుడు ఎవరితో  పొత్తు పెట్టుకుంటారో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు.  పవన్ వైఖరి ఏడాది మొత్తం సినిమాలు – నాలుగు రోజులు రాజకీయాలు అన్నట్లు ఉందని,  సమస్యలపై పూర్తి స్పష్టతతో మాట్లాడాలని అంబటి అన్నారు.  రాజధాని గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు పవన్ మర్చిపోయినట్లున్నారని, ప్రత్యేక హోదాను చంద్రబాబు వెయ్యి అడుగులు గోతి తీసి పెట్టారని గుర్తు చేశారు.  రాజకీయాల్లో వారసత్వాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి మోడీ అంటే తనకు ఇష్టం అని చెబుతున్న పవన్ సినిమాల్లో వారసత్వానికి వ్యతిరేకం కాదా? అని అంబటి నిలదీశారు. దామోదరం సంజీవయ్య 1972 లో చనిపోతే ఇప్పుడు పవన్ కు గుర్తొచ్చారా అన్నారు.

Also Read : పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్