Vivekananda Jayanthi: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి 12వ తేదిన జాతీయ యువజనోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడలు మంత్ర్రిత్వ శాఖ మంత్రి దేశంలో గల రాష్ట్రాలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ జనవరి 12 నుండి 16వ తేది వరకు పాండిచ్చేరి లో జరగనున్న నేషనల్ యూత్ ఫెస్టవల్ -2022 కు రాష్ట్రం నుండి 100 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు.
రాష్ట్రస్థాయిలో జనవరి 12న జరగనున్న నేషనల్ యూత్ డే, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా క్రీడలకు సంబంధించి కబడ్డి, ఖో ఖో, వాలీబాల్, జానపద నృత్యాలు, జానపద పాటలు తదితర సాంస్కృతిక అంశాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. స్వామి వివేకానంద జీవిత చరిత్రకు సంబందించి విద్యార్ధులకు, యూత్ అసోషియేషన్లు, స్వచ్చంద సంస్థలు, స్టేక్ హోల్డర్లులకు సంబందిత శాఖలు, ఉన్నత విద్య, రామకృష్ణ మఠం తదితర సంస్థల సమన్వయంతో వ్యాసరచన, వక్తృత్వపోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. క్రీడారంగంలో ప్రతిభావంతులు, కళాకారులు, తదితర అనుభవజ్ఞలైన వక్తలతో యువతను ప్రోత్సహించే విధంగా ఉపన్యాసాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర స్థాయి సమావేశంలో బహుమతి ప్రదానం చేస్తామని అవంతి వివరించారు.
Also Read : గో సంరక్షణకు చర్యలు: అవంతి